దళిత బంధును ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రారంభించకుండా.. హుజూరాబాద్ నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నట్టు..?

‌హుజురాబాద్:తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా ఒక సెంటిమెంట్‌.గతంలో అనేక కార్యక్రమాలను ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచే ప్రారంభించారు.తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ జరిగింది కరీంనగర్‌ జిల్లాలోనే,ఇక తాను ఎంతగానో అభిమానిం చిన అన్నదాతలను ఆదుకోవడానికి రూపొందించిన రైతు బీమా పథకాన్ని కూడా కరీంనగర్‌ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు.దేశానికే ఆదర్శంగా మారిన ప్రతిష్ఠా త్మక రైతుబంధు పథకాన్ని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కేంద్రంగానే ముఖ్యమంత్రి ప్రారంభించారు.కరీంనగర్‌ జిల్లా వేదికగా ప్రారంభించినవన్నీ సూపర్‌హిట్‌ అయ్యా యి.దీంతో దళిత బంధు పథకానికీ అదే ఆనవాయితీని సీఎం కొనసాగించనున్నారు.దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టును హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయిం చారు.పథకం ప్రారంభోత్సవ తేదీని త్వరలో కేసీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా ఒక సెంటిమెంట్ అయితే గజ్వెల్ ని యోజకవర్గం లోని చింతమడక గ్రామంలో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చారు కదా.?కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు,కరీంనగర్ జిల్లా లోని నీయొక్క దత్త్తత గ్రామమైన చిన్నముల్కనూర్ లో ఎందుకు ఇవ్వలేదు.?చింతమడక గ్రామంలోని వారే మనుషులా(ఓటర్లు)రాష్ట్రమంతా ఎందుకు ఇవ్వలేదు. ?హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎస్సీ ఉప కులాలు అయినా వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు హుజురాబాద్ బై ఎల క్షన్ కొరకు దళితులపై చూపుతున్నా ప్రేమ ఏడు సంవత్సరాలు గడిచిన అప్పుడు,ఇప్పుడు చేయవలసిన పనులు హుజురాబాద్ బై ఎలక్షన్ కొరకు ఆడుతున్న ఒక డ్రామా.హుజరాబాద్ నియోజకవర్గం లో మండలాల వారీగా కమలాపూర్,వీణవంక,జమ్మికుంట,ఇల్లందకుంట,హుజురాబాద్ ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఉప కులాల ఓట్లు దాదాపుగా 50 వేల వరకు ఉంటాయి కాబట్టి హుజురాబాద్ బై ఎలక్షన్ లో భాగంగా 10 లక్షల రూపాయల దళిత సాధికారత పేరుతో ఈ యొక్క దళితుల ఓ ట్లు కొనుగోలు కొరకు హుజురాబాద్ ను ఎందుకు ఎన్నుకున్నారు.హుజురాబాద్ బై ఎలక్షన్ లో ఓడిపోతానని భయంతో ఈ దళితుల ఓట్లను కొనుగోలు చేయడం జ రుగుతుంది ఇది వాస్తవం.తెలంగాణ లో19 మంది మాల మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు.కరీంనగర్ జిల్లా కేసీఆర్ కు సెంటిమెంట్ అయితే ఉమ్మడి కరీంనగర్ లో మూ డు ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయి ధర్మపురి,చొప్పదండి,మానకొండూర్ ఉన్నాయి.దళిత సాధికారత ‘తెలంగాణ దళిత బంధు’ను దళిత ఎమ్మెల్యేలు ఉన్నచోట మొదలు పెట్టకుండా హుజురాబాద్ నియోజకవర్గం లోనే మొదలు పెట్టడానికి కారణం తెలంగాణ సమాజానికి అర్ధం అయింది.’తెలంగాణ దళిత బంధు’ను రాష్ట్రవ్యా ప్తంగా అమలు చెయ్యాలి.ఏడేండ్లలో దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు?భట్టి విక్రమార్క,కొప్పుల ఈశ్వర్,లేక దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహి స్తున్న నియోజకవర్గాలలో ‘తెలంగాణ దళిత బంధు’ను ప్రారంభించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here