125 ఏళ్లలో అరుదైన రికార్డు..

టోక్యో:విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ఉత్కంఠగా సాగుతున్నాయ్.ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు.ఇక,125 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు ప తకం సాధించగా,అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.ఇలా తోబుట్టువు లు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్‌ చరిత్ర ఇదే తొలిసారి.అయితే,ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా,ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు.అయితే ఈ ఇద్దరు అన్నా చెలె ల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here