ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

న్యూ ఢిల్లీ:స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు.ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.అందులో 55 తుపాకులు, 50 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి.ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు.అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు.నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు.ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.డ్రోన్లు,బెలూన్లపై నిషేధం విధించారు.ఈ క్రమంలోనే అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు.నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్,50 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ విధ్వంసానికి తెర తీసినట్టు తెలుస్తోంది.అయితే వారి కుట్రను పోలీసులు ముందే పసిగట్టారు.నిఘావర్గాల హెచ్చరికలతో ముమ్మర తనిఖీలు చేశారు.ఈ క్రమం లోనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వారి వద్ద ఒక మొబైల్ ఫోన్,కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.అయితే పోలీసులకు పట్టుబడింది స్థానిక వ్యక్తు లే కావడం గమనార్హం.వీరిలో ఒకరిది ఢిల్లీ కాగా మరోకరిది ఉత్తరప్రదేశ్ గా గుర్తించారు.ఈ క్రమంలోనే ఎర్రకోటతో పాటు ఢీల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.డ్రోన్లు,బెలూన్లు ఎగరవేయడం నిషేధించారు.అరెస్టయిన నిందితులలో ఒకరు కౌశల్ గ్యాంగ్‌కి సన్నిహితుడు అని,అతనిపై హర్యానా ఢిల్లీలో రెండు హత్య కేసులలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here