దళితుల ను దగాచేస్తున్న కేసిఆర్:మంథని సామ్యెల్

మంథిని:దళిత బందు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మంథని సామ్యెల్ మాదిగ.తెలంగాణ కు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని దళివర్గాలను దగా చే సిన ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో దళిత వర్గాలు లేరని,తక్షణమే ‘దళిత బందు’ పథకాన్ని యుద్ధప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా అమ లు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసమే ‘దళిత బందు’ పథకాన్ని ప్రకటించడం జరిగిందని,దళితులఅభివృద్ధి పై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఆగష్టు 15లోపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఆగష్టు 31వరకు మిగతా 118 నియోజకవర్గాలలో 100 శాతం దళిత బందు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.గత ఏడు సంవత్సరాలుగా తన పాలన దళితులను నమ్మించి మోసగించడమేనని గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసిఆర్ దళిత బందు పథకాన్ని కూడా మరో మోసపూరిత పథకం గా మారుస్తే ఊరుకోబోమని గుర్తు చేస్తున్నాం.ఈరోజు మంథని తహసీల్దార్ కార్యాలయం ముందు షెడ్యూల్డ్ కులా ల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టడం జరిగింది ఈకార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ దీక్షా కార్యక్రమంలో మంథని చందుమాదిగ,కళామండళినాయకులు కాసిపేట బానయ్య మాదిగ అసంపెల్లి స్వామి,కొయ్యల రాజమ ల్లు,కోటయ్య,సుధాకర్,నరిగె మళ్ళీశ్వరి,పాల్గొనగా దళిత నాయకులు బూడిద గణేష్,వేల్పుల సురేష్,గొర్రెంకల సురేష్,నర్సింగ్,ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేల్పుల కుమార్,భూపల్లి నారాయణ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here