రైతు వేదికలో..రాసలీలలు

ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి విటులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.ఈ త తంగం గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.రైతు వేదిక ప్రాంతంలో మద్యం సేవించి,విటులతో శృంగారం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఆ శాఖకు చెందిన ఉద్యోగి భర్త కనుసైగల్లో ఈ వ్యవహారాలు కొనసాగుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం.రైతు వేదిక తాళాలు మాయమవడం దీనికి నిదర్శనం.రైతులకు పదికాలాల పాటు ఉపయోగపడాలని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను వ్యభిచార గృహం బూత్ బంగ్లాగా తయారుచేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here