హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు:బీజేపీ నాయకులు

జమ్మికుంట:గత మూడు నెలలుగా హుజురాబాద్ లో చీకటి అధ్యాయం నడుస్తోంది.జమ్మికుంటలో మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరైన మాజీ ఎంపీ వివేక్ వెంక టస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.పోలీసుల అరాచకాలు ఇక్కడ ఎక్కువయ్యాయి.ఇతర నియోజక వర్గాల ఎమ్మెల్యేల ను,ఎమ్మెల్సీల ను ఇక్కడ నియమించి ప్రొటోకాల్ లేకుండా పనులను ప్రారంభిస్తున్నారు.ఒక్కో మండలానికి వాళ్లే ఎమ్మెల్యేల్లాగా,ఎమ్మెల్సీల్లాగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ప్రజల మీద తోడేళ్లలాగా పడిజుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు.అకారణంగా బీజేపీ కార్యకర్తలపై,నాయకులను బైండోవర్ చేస్తున్నారు.ముఖ్య మైన నాయకుల ఫోన్లపై నిఘా పెట్ట డంతో పాటు,ఎవరిని కలుస్తున్నారనే విషయంలో నిఘా పెట్టారు.బీజేపీని నిషేదించిన పార్టీలాగా చూస్తున్నారు.అనధికారికంగా ఒక్కో పోలీసు స్టేషన్ కు ఒక్కో డీఎస్పీని,పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులను పెట్టారు.వందల మంది ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామాల్లో తిరుగుతున్నారు.ఎవరైనా యువకుడు బీజేపీ కండువా కప్పు కుని కనిపిస్తే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు పోయి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.బీజేపీ వాళ్లతో తిరిగినా,ఓటేసినా ఫించన్లు రావని,రేషన్ కార్డులు రావని బెదిరిస్తున్నారు.దళితబంధు రావాలంటే టీఆర్ఎస్ కండువా వేసుకోవాలని,ఇంటిపై గులాబీ జెండా పెట్టుకోవాలని వేధిస్తున్నారు.టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారు.ఇలాంటి నికృష్ట ఆదేశాలు ఇక్కడ నడుస్తున్నాయి.కేసీఆర్ కూలీ చేసిన డబ్బులో,వాళ్ల తాత సంపాదించిన ఆస్తోమాకు ఇవ్వడం లేదు. స్కీంల ద్వారా వచ్చే సొమ్మంతా ప్రజలదే పార్టీల పరంగా,జెండాల పరంగా సంక్షేమ పథకాలు ఇచ్చే ఆనవాయితీ ఉండదు.దీన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.ఇక్కడి ప్రజలు పార్టీల వారిగా విడి పోయి భయభయంగా బతుకుతు న్నారు.ఒకప్పుడు నక్సలైట్లకు అన్నంపెట్టిన వారిని వేధించినప్పటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు కనిపి స్తున్నాయి.హుజురాబాద్ లో ఉన్న పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసాను.హెచ్చార్సీలో కేసు ఫైల్ చేసి,హైకోర్టులో కేసులు వేస్తాం.చట్టానికి లోబడుకుండా,గురు భక్తికి,ప్రలోభాలకు పనిచేసే అధికారు లు జరగబోయే పరిణామాలకు మీరే భాద్యులు.దళిత బంధును మేం స్వాగతిస్తున్నామని ఇప్పటికే చెప్పాం.హుజురాబాద్ నోటిఫికేషన్ రాకముందే హుజురాబాద్ తో పాటు,రాష్ట్రమంతా అమలు చేయాలని కోరాం.ఓట్లకోసం కాకుండా అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం.ఊరికి పది,20 మందిని ఎంపిక చేయడం,వారిని కూడా స్థానికేత రులను,ధనవంతులను,ఉద్యోగ వంతులను,ఉద్యోగుల ను,టీఆర్ ఎస్ వాళ్లను ఎంపిక చేసారు.విధి విధానాలు లేకుండా దళిత బంధును తమకు నచ్చిన వారిని ఇచ్చుకునే దరిద్రపు పద్ధతి నడు స్తోంది.హుజురాబాద్ లోని అన్ని చోట్ల దళితులు ఇప్పటికే ధర్నాలు,ఊరేగింపులు తీసి శాపనార్థాలు పెడుతున్నారు.ఇదంతా నాటకమని వారు గమనించారు.ఈటలను ఓడించేందుకే ఈ స్కీం తెచ్చారని వారే చెబుతున్నారు.సీఎం వస్తున్న సందర్భంగా ఎక్కడికక్కడ హుజురాబాద్ లో బీజేపీ నేతలను ఎక్క డికక్కడ అరెస్టులు చేస్తున్నారు.ఏ చట్టం ప్రకారం ఈ అరెస్టులు చేస్తున్నారు.మీటింగ్ కు వచ్చి డిస్ట్రబ్ చేస్తే అరెస్టు చేయాలి తప్ప.ఏ కారణంగా లేకుండా ఎలా అరెస్టు చేస్తారు.దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.మాకు చేతగాక కాదు,మా ఓపికను,సహనాన్ని పరీక్షించకుండా,అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.మీరెన్ని చేస్తే అంత రియాక్షన్ వస్తుంది.గోడ కు కొట్టిన బంతిలా మీకే పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి.వాళ్ల కండువా కప్పు కుంటే తప్ప ఏ పనిచేసుకోకుండా బెదిరిస్తున్నారు.సీడ్ కంపెనీలకు రావాల్సిన బిల్లులు కూడా ఆపుతూ బెదిరిస్తున్నారు.బీజేపీతో ఏ మాత్రం సంబంధం ఉన్నట్లు తెలిసి నావారిని బెదిరిస్తూ,ఓడిపోతామన్న భయంతో ఇలాంటి ఛండాలపు పనులు చేస్తున్నారు.దమ్ముంటే,ధైర్యముంటే మీ సిద్ధామేందో,మీరేం చేస్తారో,మీ పాలసీ ఎందో చెప్పుకుని ఓట్లు అడగండి.ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలు చేస్తానంటే కుద రదు.2006 లో కేసీఆర్ కరీంనగర్ లో పోటీ చేసినప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది.అయినా కేసీఆర్ ను గెలిపించుకునేందుకు ప్రజలే అండగా ఉండి,నిర్బంధాలు చేధించి ఆయనను గెలిపించారు.ఇప్పుడు కూడా ప్రజలే కథానాయకులై మీ అంతు చూస్తారు.హుజురాబాద్ గడ్డపై ఉండాలంటే గులాబీ కండువా వేసుకోవాలా? మేము మనుషుల మా? మీకు బానిసలమా?దళితులకు దళితబంధు ఇస్తున్నారు సంతోషం.సంచార జాతులు కూడా పేదరికంలో గడుపు తున్నారు.బీసీల్లో,అగ్రకులాల్లోని పేదలు న్నారు.ఇలాంటి వాళ్లందరికీ 10 లక్షలిచ్చే పథకాలు ఇవ్వాలి.దళిత బంధు ఇచ్చినట్లే ఇచ్చి కలెక్టర్ల పెత్తనం పెట్టి,అనేక ఆం క్షలు పెడితే దళితులు మిమ్మల్ని బండకేసి కొడతారు.ఆ పదిలక్షల సొమ్ముపై వారికే సంపూర్ణ అధికారం ఉండాలి.గజకర్ణ గోకర్ణ,టక్కు టమార విద్యలు చేసి ఓట్లు దొబ్బుకు పోదామని చూస్తే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారు.ఇక్కడ ఎడ్డివాళ్లు లేరు.ఇక్కడి ప్రజలు గొర్రెలు కాదు.హుజురాబాద్ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. మంచీ,చెడు తర్కించే ప్రజలున్న ప్రాంతం ప్రజలు కూడా అన్నీ గమనించాలి.ఇవన్నీ కేవలం ఈటల రాజేందర్ ను ఓడించేం దుకేనని గుర్తించాలి.ఎక్కడ ఇవ్వంది.మ హిళా సంఘాలకు వడ్డీ బకాయిలు మాఫీ చేస్తున్నారు సంతోషం.కానీ ఇవన్నీ రావడానికి కారకుడైన ఈటల రాజేందర్ ను గుర్తుంచుకోండి.ఇవన్నీ మీమీద ప్రేమతో కాదు.నిజంగా ప్రేముంటే ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వడంలేదన్నది ఆలోచించండి.నా వల్ల నియోజకవర్గ ప్రజలకు లాభం జరుగుతుందంటే వాళ్ల రుణం తీర్చుకుంటున్నట్లు భావిస్తున్నామని అందుకే వాళ్ల కుట్రలను చేధించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here