ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన ది మిత్రి మురాటోవ్‌లను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.”యుద్ధ ప్రచారం,అబద్ధాలు,అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత,స్వతంత్ర,వాస్తవ ఆధారిత పాత్రికేయం మాత్రమే నిలుస్తుంది” అని కమిటీ చైర్మన్ బెరిట్ రైసా అండర్సన్ వ్యాఖ్యానించారు.బహుమతి గ్రహీతల్లో ఒకరైన మరియా రెసా 2012 నుంచి రాప్లేర్ అనే న్యూస్ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు.వివాదాలు,హత్యారాజకీయాలు,మాదకద్రవ్యాల ఆధారిత ఆర్థిక కార్యకలాపాలతో నిం డిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో పాలనపై రెసా పదునైన విమర్శలు చేస్తూ వెబ్‌సైట్‌లో కథనాలు, వార్తలు అందిస్తున్నారు.ప్రజాభిప్రాయాన్ని వక్రీకరిస్తూ,తప్పుడు వార్తలు వ్యాప్తి చే స్తూ,ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయడానికి సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకుంటున్నారనేది రెసా,రాప్లేర్ ఆధారాలతో సహా బయటపెట్టినట్టు నోబెల్ కమిటీ ప్రశంసించిం ది.సహ పాత్రికేయులను వధిస్తున్నాఅధికార రాజకీయాలకు లొంగకుండా రష్యాలో స్వతంత్రంగా పనిచేస్తున్న వార్తాపత్రిక ‘నొవాయా గజెటా’ వ్యవస్థాపకుల్లో మురాటోవ్ ఒకరు.అన్ని రకాల అధికారాన్ని ధిక్కరి స్తూ 1993 నుంచి ఈ పత్రిక నడుస్తోంది.’రష్యాలోని స్వతంత్ర పత్రికల్లో ‘నొవాయా గజెటా’ముందువరుసలో ఉంటుంది.సెన్సార్‌షిప్ వల్ల ఇతర మీడియాలో కనిపించని ఎన్నో వార్తలను అందిస్తూ రష్యాలో ఏం జరుగుతోందో తెలుసుకోవాల నుకునేవారికి ముఖ్యమైన పాత్రికేయ వనరుగా మారింది.నిర్భీతితో,వాస్తవాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయాన్ని అందిస్తూ,వృత్తిగత వ్యక్తి త్వాన్ని చాటుకుంటోంది”అని నోబెల్ కమిటీ కొనియాడింది.పత్రికలో పనిచేసే ఆరుగురు జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉండగా హత్యలకు గురైనట్టు తెలిసింది.అయినా,మురాటోవ్ స్థిరమైన ఆలోచనలతో పాత్రికే యరంగంలో కొనసాగడం అభినందనీయమని వ్యాఖ్యానించింది.కాగా,పాత్రికేయులను శాంతి నోబెల్‌కు ఎంపిక చేయడం ఇది మూడోసారి.1907లో తొలి సారి,1935లో రెండోసారి ఈ బహుమానం సాహస జర్నలిస్టులను వరించింది.పుర స్కారంగా లభించే 11.4 లక్షల డాలర్ల (రూ.8.2 కోట్లు) నగదును రెసా,మురాటోవ్ సంయుక్తంగా పంచుకొంటారు.