ఆ జెండా కోసం..పోలీసు జాగిలాలతో గాలింపు అవసరమా..?

వికారాబాద్:రాష్ట్రంలో హత్యలు,అత్యాచారాలు జరిగితే,పెద్ద పెద్ద చోరీలు జరిగితే,ఎవరి పైన అయినా దాడులు జరిగితే అటువంటి కేసుల దర్యాప్తులో నత్తకు నడక నేర్పుతూ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఓ కేసులో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది.పోలీసుల్లో ఇంత పనితనం ఉందా అన్న చర్చకు కారణమైంది. ఈ మాత్రం దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో అన్న చర్చ జరిగింది.పోలీసు జాగిలాలతో ఊరంతా గాలింపు చేపట్టి హంగామా ఇంతకీ ఏం జరిగిందంటే,ఏదో పెద్ద హత్య కేసును దర్యా ప్తు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ లోని మల్లెమోనిగూడ లో టిఆర్ఎస్ పార్టీ జెండా కోసం దర్యాప్తు మొదలుపెట్టారు.ఆ గ్రామంలో గ్రామ స్తులంతా ఎవరో దొంగల్ని పట్టుకోడానికి,లేదా హంతకులను పట్టుకోవడానికి పోలీస్ కుక్కలు వచ్చాయని,డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారని చర్చించుకుంటే ఇక అసలు విషయం తెలి సినవారు ఆ తర్వాత అవాక్కయ్యారు.పోలీసు జాగిలాలతో ఊరంతా గాలింపు చేపట్టి హంగామా చేసిన పోలీసుల సిన్సియారిటీకి షాక్ తిన్నారు.పోలీస్ జాగిలా న్ని తీసుకువచ్చి టిఆర్ఎ స్ పార్టీ జెండా గద్దె దగ్గర ప్రాంతమంతా పోలీస్ డాగ్ ను తిప్పారు.పోలీస్ కుక్కలతో హడావిడి కొనసాగుతుంటే,గ్రామస్తులంతా ఏం జరిగిందో అని ఆసక్తిగా చూశారు.వాటితోపాటు పరుగు లు తీశారు.పోలీస్ కుక్కల హడావిడితో గందరగోళంలో గ్రామస్తులు ఎక్కడ ఏం జరిగిందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు గ్రామస్తులు.గ్రామంలోకి పోలీ సులు,పోలీసు వాహనా లు,పోలీస్ కుక్కలు రావడంతో ఎంత భయంకరమైన నేరం జరిగిందో అంటూ గుసగుసలాడుకున్నారు.ఎక్కడా? ఏం జరిగిందట అంటూ ఆరా తీశారు.తీరా టిఆర్ ఎస్ పార్టీ జెండా కోసమే పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి అని తెలిసి ప్రజలు షాక్ అయ్యారు.పెద్ద పెద్ద నేరాలు జరిగితే పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ జెండా పోతే రియాక్ట్ అయిన విధానం చూసి పెదవి విరిచారు.అధికార టీఆర్ఎస్ జెండా పోతే పట్టుకోకుంటే తమకు ఏం ఇబ్బంది వస్తుంది అనుకున్నారో అధికార పార్టీ నేతలతో చివాట్లు పడతాయి అనుకు న్నారో ఏమోగానీ పోలీ సులు అత్యుత్సాహం ప్రదర్శించారు.పార్టీ జెండా కోసం పోలీసు జాగిలాలా నవ్విపోతున్న జనాలు ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.కేవలం పార్టీ జెండా కోసం పోలీసు జాగిలాలు ఉపయోగించడంపై పోలీస్ అధికారులను ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పకపోవడం గమనార్హం.నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరించిన పోలీసుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here