హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లకు..నేటితో ముగియనున్న గడువు

కరీంనగర్:తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది.దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.హుజూరా బాద్‌ ఉప ఎన్నికకు ఇప్పటికే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ ఉప ఎన్నిక ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రతిష్టంగా మారాయి.హుజూరాబాద్‌లో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉంది.బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఇప్పటికే ఆయన సతీమణీ జమున తరఫున ఓ సెట్ నామి నేషన్ దాఖలైంది.అయితే ఈటల రాజేందర్ నామినేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.ఇప్పటికే టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.ఇక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.హుజూరాబాద్‌లో ఇప్పటి వరకు తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఈ నెల 11న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు.హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు.గత 4 రోజులుగా నామినేషన్ పత్రాలతో వస్తున్నా తమను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.ఇవాళ కూ డా నామినేషన్ వేసేందుకు వెళ్తామని ఫీల్డ్ అసిసెంట్లు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here