పోలీసులకు చిక్కిన..మావోయిస్టు నేత మధుకర్‌ మృతి

కుమురం భీం ఆసిఫాబాద్:కరోనా చికిత్స పొందుతూ మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ మృతి చెందాడు.ఈనెల 2వ తేదీన అదు పులోకి తీసుకున్న పోలీసులు కరోనా చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున గుం డె పోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం.ఇతను 22 ఏళ్లకింద ట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడి గా చేరారు.మొన్న పోలీసులకు చిక్కే వరకూ దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటి కార్యదర్శగా ఉన్నాడు.మ ధుకర్‌పై 8 లక్ష ల రికార్డు ఉంది.ఈ నెల 2న వరంగల్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గడ్డం మధుకర్‌తో పాటు కొరియర్‌(మైనర్‌)ను మట్టె వాడ పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం ఉస్మానియా చికిత్సకు తరలించారు.చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here