సువెందు సోదరులపై కేసు నమోదు

కోల్‌కతా:లక్షల విలువ చేసే రిలీఫ్‌ మెటీరియల్‌ దొంగిలించారన్న ఆరోపణలపై బిజెపి నేత సువేందు అధికారి,ఆయన సోదరుడిపై పోలీస్‌ కేసు నమోదైంది.పూర్బా మె డ్నిపూర్‌ జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి వీటిని దొంగిలించారని కాంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డు సభ్యుడు రత్నదీప్‌ మన్నా చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.గత నెల 29న సువేందు అధికారి ఆయన సోదరుడు,కాంతి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్‌ చీఫ్‌ సౌమేందు అధికారి ఆదేశా ల మేరకు ఈ మున్సిపాల్టిటీ కార్యాలయం గోడౌన్‌ తాళాలు అక్రమంగా పలగల గొట్టి లక్షల విలువ చేసే సహయ సామాగ్రిని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.గ తంలో తృణమూల్‌ నేతలు ఇలా సహాయ సామాగ్రిని కొట్టేస్తున్నారని బిజెపి ఆరోపణలు చేయగా ఇప్పుడు సువేందు,ఆయన సోదరుడిపై ఇవే ఆరోపణలతో కేసు న మోదు కావడం గమనార్హం.దొంగతనానికి పాల్పడే సమయంలో వారిద్దరు భద్రత నిమిత్తం భద్రతా బలగాలను ఉపయోగించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.చీటింగ్‌ కేసులో సువేందు అధికారి సన్నిహితుడుపై కేసు నమోదైన మరుసటి రోజే ఈ దొంగతనం కేసు దాఖలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here