హరీష్ రావు ఏడ్చింది నిజమే..(నా)?

హైదరాబాద్:గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పెద్ద బాంబే పేల్చారు.కేసీఆర్ తీరును ఎండగట్టిన రాజేందర్ ప్రగతి భవన్ టార్గెట్ గా ఘా టు వ్యాఖ్యలు చేశారు.బానిసగా ఉండలేకే బయటికి వచ్చానన్నారు.కేసీఆర్ పై ఈటల చేసిన ఆరోపణల కంటే మంత్రి హరీష్ రావును ఈ వివాదంలోకి లాగడమే హాట్ టాపిక్ గా మారింది.ఒక రకంగా హరీష్ రావును ఈటల రాజేందర్ ఇరికించారనే చర్చ జరుగుతోంది.గత ఐదేండ్లుగా తాను అవమానాలకు గురవుతున్నానని చెప్పిన ఈటల.తానే కాదు హరీష్ రావు కూడా అవమానించబడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందని ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారని గతంలో ప్రచారం జరిగింది.హరీష్ రా వు కొన్ని నెలల వరకు ప్రగతి భవన్ రాకపోవడం,పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనపోవడం ఇందుకు బలాన్నిచ్చింది.2018లో రెండోసారి అధికారంలోకి వ చ్చిన తర్వాత కేబినెట్ లోకి ఈటలతో హరీష్ రావును తీసుకోలేదు.దీంతో హరీష్ ను కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి.పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరిని హరీష్ తయారు చేశారనే అనుమానాలు గులాబీ బాస్ కు ఉన్నాయట.తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారని సదరు నేతకు సంబంధించిన నివేదికలు కేసీఆర్ దగ్గర ఉన్నాయంటున్నారు.అందుకే ఆ నేతను కేసీఆర్ దూరం పెడుతున్నారని కథనాలు వచ్చాయి.తర్వాత ఉద్య మ నేతలను దూరం పెట్టారని విమర్శలు పెరగడంతో అయిష్టంగానే మంత్రివర్గంలో చోటు కల్పించారని అంటున్నారు.మంత్రులుగా ఉన్నాఈ ఇద్దరు నేతలకు పార్టీలో నూ ప్రభుత్వంలోనూ ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ ఉంది.ఈ నేపథ్యంలో హరీష్ రావును కేసీఆర్ కుటుంబం అవమానించిందంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.మరోవైపు ఈటలతో పాటు హరీష్ రావుపై  రెండేండ్లుగా కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు.వాళ్లిద్దరిపై వేటు కోసం చూ స్తున్న కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియడం,మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే యాక్షన్ మొదలు పెట్టారని అంటున్నారు.మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏ ఎన్నికలు లేకపోవడంతో ఏం జరిగినా ఎన్నికల సమయానికి అంతా సర్ధుకుంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు.ఈటల కథ ముగియడంతో తర్వాత టార్గెట్ హరీష్ రావే అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here