లక్నో:అలీఘర్ కల్తీ సారా ఘటనలో కీలక నిందితుడైన బిజెపి నేత రిషి శర్మను పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.రిషి శర్మపై ప్రభుత్వం రూ.లక్ష రూపాయల రివార్డును ప్రకటించింది.కల్తీ సారా కారణంగా అలీఘర్‌లో వంద మందికి పైగా ప్రాణాలు పొగొట్టుకున్న విషాద కర ఘటన గత నెల జరిగిన సం గతి తెలిసిందే.నిందితునికోసం పోలీసులు రాజస్థాన్,ఢిల్లీ,హర్యానా,ఉత్తరప్రదేశ్‌లలో గాలించారు.500 ఫోన్ రికార్డులతో పాటు వందమందికి పైగా ఇన్‌ఫార్మర్ల సాయం తో ఆరు పోలీసు బృందాలు ఈ గాలింపు చేపట్టినట్లు అలీఘర్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.రిషి శర్మ పరారీలో ఉండగా ఆయన భార్య,కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అలీఘర్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లలో నిందితునిపై 17కు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు.కాగా ఈ కేసులో పలువురు ఎక్సైజ్ అ ధికారులు సీనియర్ పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉండటంతో మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.అధికారులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతా ధికారి తెలిపారు.