న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి కోవిడ్ సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది.కరోనా టెస్టుల్లో గోల్‌మాల్ జరిగినట్లు తాజాగా రిపోర్టులు చెబుతున్నాయి.హరిద్వారాలో కుంభమేళా జ రుగుతున్న సమయంలో సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో సుమారు ఒక లక్ష వరకు కరోనా ఫేక్ రిపోర్ట్‌లను ఇచ్చారని ఉత్తరాఖండ్ ప్రాథ మిక విచారణలో తేలింది.ఇదంతా ప్రైవేట్ ల్యాబ్ ల పనే అని తేలింది.కుంభమేళా సమయంలో రోజూ 50 వేల కోవిడ్ టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడం తో ఆ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రైవేట్ ల్యాబ్ లు టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని తాజాగా గుర్తించారు.ఒకనొక సందర్భంలో ఒకే ఫోన్ నంబర్ ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించినట్లు గుర్తించారు.అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్నవారి సమాచారం పూర్తిగా ఫేక్ అని కూడా తేలింది.హరిద్వార్‌లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు ఐదు వందల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు.కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఏజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...