తెలంగాణలో..నేటి నుండి రైతు బంధు పంపిణీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు సాయం నేటి నుంచి అందించేందుకు రాష్ట్ర సర్కార్‌ సిద్ధమైంది.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 ల క్షల 18వేల ఎకరాలకు సంబంధించి 63.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది.ఈ మేరకు రైతులు,భూముల వివరాలతో కూడా జాబితాను సీసీఎల్ఏ వ్యవసాయ శాఖకు అందించింది.ఆ జాబితా ప్రకారం 63 లక్షల 25 వేల 695 మంది రైతుల ఖాతాల్లో రూ.7508.78 కోట్లను రైతుబంధు సా యం కింద జమ చేయనుంది ప్రభుత్వం.2021-22 బడ్జెట్‌లో వర్షాకాలం,యాసంగి సీజన్లలో రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించిన విషయం తెలి సిందే.ఈ నిధుల్లో నుంచి ఆర్థికశాఖ వానాకాలం సాయానికి అవసరమైన రూ.7508.78 కోట్ల నిధులు మంజూరు చేసింది.నేషనల్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధుల ను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here