మూత్రం రంగు మారితే..ఈ సమస్య కావచ్చు

వరంగల్:చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది.అందువల్ల మూత్రం రంగు మారినా,మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది.ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి.దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది.తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి.ఇది రక్తంలో వ్యర్థాల ఫలితంగా జరుగుతుంది.ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది.కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి.అవి శరీ రంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి.ఒకవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది.అలసట మరియు మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి.తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది.కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.ఇది కిడ్నీ లు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్‌ఫెక్షన్లు,రాళ్లకు కూడా కారణమవుతుంది.వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది.ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here