కేసిఆర్ సంస్కార హీనుడు:బండి సంజయ్

హైదరాబాద్:తెలంగాణ సిఎం కేసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వా క్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు.స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని. రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ సీఎం కేసిఆర్ మాత్రం స్పందించలేదని.ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు.రూ.2,500 కోట్లు ఎక్కడ ఖర్చు చేసావు.కమిషన్లు పోయాయనే పీఎంకి కృతజ్ఞతలు చెప్పలేద న్నారు.వ్యాక్సిన్ వృధాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.పార సీటమాల్ తో కరోనా పోతుందన్న సీఎం ఇప్పుడు వైద్య మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.కేంద్రాన్ని విమర్శించడం తప్ప కేసిఆర్ ఏమీ చేయడం లేదని ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలని డిమాండ్ చేశారు.ఒకాయన సిద్దిపేటలో ఇంకోకాయన ట్విట్టర్ లో మాట్లాడుతారని చురకలు అంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here