కేసీఆర్..‌హామీల మాటేమిటని:మండిపడ్డ ఈటల

కరీంనగర్/జమ్మికుంట:అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా మండిపడ్డారు.టీఆర్‌ఎస్‌ కుట్రలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని విమర్శించారు.నాయకుడంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాల్లో నిలిచి పోవలసి వస్తుందని హితవు పలికారు.ఈ మేరకు ఇల్లందకుంటలో ఈటల రా జేందర్‌ బుధవారం పర్యటించారు.నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపఎన్నిక వస్తుందంటే అక్కడ కేసీఆర్‌ వరాలు ప్రకటిస్తారని దుయ్యబట్టారు.సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు.తన రాజీనామాతో సీఏం కొత్త రేషన్ కా ర్డు మంజూరు చేశారని ఆదే విధంగా రెండేళ్లుగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు,తెల్లరేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.57 సంవత్సరాలు నిండిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలిపారు.హుజూరాబాద్ నియోజక వర్గంలోని వావిలాల,చల్లూరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.గ తంలో హుజూరాబాద్ జిల్లా కావాలని కోరినట్లు గుర్తు చేశారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలతో పాటు జిల్లా ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.ఎక్కడ ఉప ఎన్నిక వచ్చిన వరాల జల్లు కురిపించే సీఎం కేసీఆర్,హుజురాబాద్‌కు విరివిగా నిధులు,పనులు మంజూరు చే యాలని ఈటల డిమాండ్‌ చేశారు.చిన్న గ్రామాలకు 50 లక్షలు,పెద్ద గ్రామాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు.నంగనాచి మా టలతో నియోజకవర్గ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని రాజభక్తి చాటుకుంటే చాటుకొని కానీ తనపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.ప్రభుత్వం ప్రక టించే తాయిలాలకు డబ్బు సంచులకు ప్రజలు లొంగరని,ప్రజల గుండెల్లో తాను ఉన్నానని ఈటల పేర్కొన్నారు.ధర్మ యుద్ధం కురుక్షేత్రం జరుగుతుందని ఆనాడు పాండవులు గెలిచినట్లు రాబోయే ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని అన్నారు.పిడికెడు మంది కల్లబొల్లి మాటలు చెప్పినా హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here