రేవంత్ రెడ్డి ట్వీట్ తో..ఇరుకునపడ్డ మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యేలు రసమయి,క్రాంతికిరణ్..?

హైదరాబాద్:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యం గా చేసిన ట్వీట్‌ కలకలం రేపుతోంది.ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.’రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా.? అంటూ ఆ ట్వీట్ సాగింది.ఆ ఎమ్మెల్యేలు వీరే ట్వీట్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్,క్రాంతి కిరణ్,మంత్రి జగదీశ్ రెడ్డిను ఉద్దేశిస్తూ చేసినట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబో తోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు.గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్ణాటకలో గల హంపీలో జరిపారని ట్వీట్ ‌కు జత చేసిన పత్రికా కథనం తెలుపుతోంది.వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.పేరుకు పుట్టిన రోజు వేడుక లైనా అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా వార్తా కథనంలో ఉంది.కేటీఆర్‌ను సీఎం చేయడం ఈటల కొత్త పార్టీ తదితర అంశాలపై చర్చించినట్టుగా కథనాన్ని రా శారు.ఈ నేపథ్యంలోనే రేవంత్ ట్వీట్ చేసినట్టు చెబుతున్నారు.ఈ ట్వీట్ పొలిటికల్‌ సర్కిళ్లలో హీట్ పుట్టిస్తోంది.మంత్రి కేటీఆర్,ఈటల రాజేందర్ వ్యవహారం గురించి ముందుగానే డిస్కష్ చేశారా అనే అంశం వెలుగుచూసింది.దీనినిబట్టి ఈటల రాజేందర్ పార్టీ వీడటం,ఇతర పార్టీలో చేరడం లేదంటే రాజకీయ పార్టీ పెట్టే అంశంపై చర్చ జరిగింది.పరిస్థితులను అంచనా వేసి డిస్కష్ చేసి ఉంటారని అనిపిస్తోంది.దీంతో జగదీశ్ రెడ్డి పాత్ర స్పష్టమయ్యింది కుమారుడి బర్త్ డే సందర్భంగా జరిపిన సమావే శం రాజకీయంగా దుమారం రేపింది.మంత్రి జగదీశ్ రెడ్డి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేవరకు వెళ్లింది.


Revanth Reddy@revanth_anumula
‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’..కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం..యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…?!

Image

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here