జగన్,కేసీఆర్ సన్నిహితులే-కేటీఆర్ అంటే కేసీఆర్ కుమారుడా.?పదవి రాలేదనో..అలిగో పార్టీ పెట్టలేదు:షర్మిల

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల జల వివాదం పైన వైఎస్సార్టీపీ నేత షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.తెలంగాణ ఏ ఇతర రాష్ట్రం కోసం చుక్క నీరు కూడా వదులుకోదని తేల్చి చెప్పారు.అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క బొట్టు నీరు కూడా తీసుకోమన్నారు.కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలంటూ షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,కేసీఆర్ ఇద్దరూ ఇద్దరూ సన్నిహితులేనని అధ్యక్షురాలు షర్మిల చెప్పుకొచ్చారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యే ఇప్పుడే ఎందుకు వచ్చిందో ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పాలని నిలదీసారు.కేటీఆర్ అంటే ఎవరు.?సీఎం కుమారుడా..కేటీఆర్ తాజాగా తన మీద చేసిన వ్యాఖ్యలకు షర్మిల తీవ్రంగా రియాక్ట్ అయ్యా రు.కేటీఆర్ అంటే ఎవరు సీఎం కుమారుడా అంటూ ప్రశ్నించారు.టీఆర్ఎస్ లో ఎంత మంది మహిళలు ఉన్నారని షర్మిల నిలదీసారు.కేటీఆ ర్ లో దృష్టి లో మహిళలు వంటింటికి వ్రతాలకు పరి మితం కావాలని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.మహిళలను కేసీఆర్ గౌరవించరని ఆరోపించారు.మహిళా స ర్పంచ్ కు కుర్చీ కూడా ఇవ్వ ని ఆక్షేపించారు.కేసీఆర్ ను ఉద్యమ కారుడిగా గౌరవిస్తానని చెబుతూనే,ఆయనలోని నియంత దొర బయటకు వచ్చారన్నారు.తెలంగా ణలో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే నని ఆరోపించారు.కాంగ్రెస్ అమ్ముడుపోయిన పార్టీగా విమర్శించారు.పదవి రాలేదనో..అలిగో పార్టీ పెట్టలేదు.తనకు గుర్తింపు రాలేదనో పదవి ఇవ్వలేదనో అలిగో పార్టీ పెట్టలేదని షర్మిల తేల్చి చెప్పారు.తాను తెలంగాణ ప్రజలకు అండగా నిలివాలనే లక్ష్యంతో వచ్చానని స్పష్టం చేసారు.వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా,కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలని సూచించారు.విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ చేశారని ఎంతో మందికి మేలు చేశారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదన్నారు.ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసారు.యుపిఎ మ్యా నిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు పై పెట్టారని షర్మిల వివరించారు.హుజూరాబాద్ ఎన్నిక దేని కోసం.హుజూరాబాద్ ఎన్నికల పైనా షర్మిల కీలక వ్యాఖ్యలు చేసా రు.అసలు ఎందుకు వచ్చాయని షర్మిల ప్రశ్నించారు.స్వార్ధం కోసం ప్రతీకారం కోసం ఈ ఎన్నికలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఈ ఎన్నికలతో ప్రజలకు ఏం ఉపయో గమని నిలదీసారు.తాను ఒంటరి కాదన్నారు.సింహం సింగిల్ గా ఉంటే భయపడదని షర్మిల కామెంట్ చేసారు.కోట్లాది మంది వైఎస్సార్ అభిమానులు తన వెంట ఉన్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణలో ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.ప్రజల నుండి నాయకులను తెచ్చుకుంటామని చెప్పారు.ప్రభంజనం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసారు.తెలంగాణ నా గడ్డ ఇది రియాలిటీ అని తెలిపారు.ప్రజల కోసం నిలబడే పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు.అలిగితే పుట్టింటికి వెళ్లకుండా పార్టీ పెడతామా అని ప్రశ్నించారు.తెలంగాణ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు.తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవ సరం ఉంది.పెట్టామని షర్మిల స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here