కరీంనగర్‌లో కాల్పులు..పోలీసుల అదుపులో ఒకరు

కరీంనగర్:కరీంనగర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి.కరీంనగర్ లోని లక్ష్మీనగర్ నగర్ లో తుపాకుల మోత మోగింది.కాల్పులకు కారణం అన్నదమ్ములు మధ్య ఘర్షణ అని తెలుస్తుంది.ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.సుమారుగా 3 కోట్లు విలువ గల ఇల్లుపై గొడవలు జరుగుతున్నాయి.ఐ దుగురు అన్నదమ్ముల మద్య పంచాయతీ కూడా జరిగింది.శుక్రవారం ఆస్థి వివాదం పై మళ్లీ గొడువ జరిగింది.వాగ్వివాదంతో పాటు ఘర్షణ కు దిగారు.అజ్గర్ హుస్సే న్ కత్తితో మొదట తమ్ముడు మున్వార్ హుస్సేన్ పై దాడి దిగాడు.మిగతా అన్నదమ్ములు వెంటనే అజ్గర్ పై దాడికి ప్రయత్నించారు.దాంతో అజ్గర్ తుపాకి తో మూ డు రౌండ్ల కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో పార్కింగ్ చేసిన కారుకు బుల్లెట్ దిగింది.ఎవరికి గాయాలు కాలేదు.దాంతో అతడిని అక్కడ ఉన్నవారు అడ్డుకున్నారు.స మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అజ్గర్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ తుపాకి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పో లీసులు విచారణ చేపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here