హైదరాబాద్:అవిగో ఉద్యోగాలు ఇవిగో నోటిఫికేషన్లు తెలంగాణలో గత నాలుగేండ్లుగా సాగుతున్న తంతు ఉంది.ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయ డం అధికారులు హడావుడి చేయడం నిరుద్యోగులు ఆశతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరుగుతున్నాయి.కొన్ని రోజుల తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తకుండా సర్కార్ సైలెంట్ కావడం ఎప్పటిలానే నిరాశతో నిరుద్యోగులు నిట్టూర్చడం కామన్ గా సాగుతోంది.అందుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతం తెలంగాణ యువత.తాజాగా మరోసారి ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేస్తోంది.ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వం కొన్ని రోజులుగా హడావుడి చేస్తోంది.ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందనే రేంజ్ లో పాలకులు,అధికారులు కలరింగ్ ఇచ్చారు.కేబినెట్ సమావేశాలు నిర్వహించారు.దీంతో ఈసారి ప క్కా అనుకున్నారు.కాని రోజులైనా గడుస్తున్నా నోటిఫికేషన్ల జాడ లేకపోగా బుధవారం మరో బాంబ్ పేల్చింది కేసీఆర్ సర్కార్.కసరత్తు అంతా పూర్తైంది ఖాళీలను గుర్తించడం జరిగిందని వారం రోజులుగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఐదు రోజుల్లో పూర్తి వివరాలను అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందనే ప్రకటన వచ్చింది.దీంతో ఇన్ని రోజులుగా అధికారులు ఏం కసరత్తు చేశారు కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు మళ్లీ వివరాలు ఇవ్వాలని కోరడం ఏంటనే ప్రశ్నలు వస్తు న్నాయి.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కలిపి మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రిమండలికి వివరాలు కూడా సమర్పించిం ది.దీంతో బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఖాళీల భర్తీపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూశారు.కానీ ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతించే అంశం మళ్లీ వా యిదా పడింది.అధికారులు అందించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని సమగ్ర వివరాలను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...