ములుగు:ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది.ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి.దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు దావానంలా ఊరంతా వ్యాపించాయి.దాంతో ఆదివాసీలు ప్రాణభయంతో పిల్లలను పట్టుకుని పరుగులు తీశా రు.ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ములుగు జిల్లా మంగపేట,కన్నాయిగూడెంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది.ఈ గాలి దుమారం కారణంగా మంగపేట మండలం శనగకుంటలో ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.ఆ మంటలు కాస్తా ఊరంతా వ్యాపించి భారీగా ఎగసిపడుతున్నాయి.ఆదివాసీ గూడెం మొత్తం అగ్నికి ఆహుతైపోతోంది.గ్రామంలోని గిరిజన కుటుం బాలు చెల్లాచెదురయ్యాయి.అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.దాంతో ఆ ప్రాంతం అంతా అంధకారంగా మారింది.చిమ్మచీకట్లలోనే ఊరికి దూరం గా పిల్లలతో సహా పరుగులు తీశారు.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...