తెలంగాణకు చల్లని కబురు..మూడు రోజులపాటు వర్షాలు:వాతావరణ శాఖ

మంచిర్యాల:తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాష్ట్రంలో ఉరుములు,మెరుపు లు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందిస్తుంది.ఆదిలాబాద్‌,కుమురం భీం,మంచిర్యాల,నిజామాబాద్‌,నిర్మల్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ సంచాలకులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here