సీఐ వివాదంపై మహేందర్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు..?

వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీనిపై స్పం దించిన విపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఈ ఘటన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీ సులు అంటే నాకు గౌరవం ఉంది.నన్ను వేదికపై ఇబ్బంది పెట్టారు.రూరల్ సీఐని ఎందుకు ఇలా జరిగింది అని అడిగాను.రూరల్ సీఐ,టౌన్ సీఐతో నేను ఫోన్‌లో మాట్లాడాను.నేను సీఐని ఒక్క మా ట కూడా అనలేదు.ఆ ఆడియో రికార్డు కూడా నాది కాదు.ఏకంగా దూషించానని వార్తలు వేస్తున్నారు.అయినా,నేనేం వెనక్కి తగ్గను,తాండూరు ప్రజలకు సేవ చేయడానికి రెడీ ఉన్నాను.తాండూరు ప్రజలు రౌడీలు కాదు దేవుళ్లు.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయించాడని తెలుస్తోంది.పైగా నేను మనస్తాపం చెందానని ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.నిన్న వేదికపై నన్ను అవమానిం చారు.రౌడీలను తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టారు.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఎప్పుడూ ఇద్దరు రౌడీలు ఉంటారని మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాండూరులో భయంకరంగా ఇ సుకు దందా నడుస్తోంది.ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారని మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here