పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో “సదాశయ ఫౌండేషన్”కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు కందుల సంధ్యారాణి,పాలకుర్తి జెడ్పీటీసీ (తెరాస నాయకురాలు)పోచం దంపతులు.బతికి ఉన్నన్ని రోజులు ప్రజాసేవకు అంకితమైన తమ శరీరం మరణానంతరం కూడా పది మందికి ఉపయోగపడాలనేది తమ కోరిక అని సంతోషం వ్యక్తం చేశారు కందుల దంపతులు.ఈమేరకు ఒప్పంద పత్రాలను ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మహిళా తెరాస నాయకురాలు మాట్లాడుతూ దానాలు ఎన్నో కడుపు నింపే అన్నదానం మంచిదే.జీవితాలనిచ్చే విద్యాదానం మంచిదే.కానీ అవ యవ దానం,శరీర దానం అలాకాదు.ఎంతోమందికి కొత్త జీవితాలనిస్తుంది.వాడిపోయిన జీవితాలను చిగురింపజేస్తుంది.ఆశలు అడుగంటిపోయినవారికి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది.అదే శరీర, అవయవ దానంలోని గొప్పదనం.డబ్బులిస్తే అవసరం తీరిపోయాక మర్చిపోతారు.అదే శరీర,అవయవ దానం అయితే కొత్త జీవితాలను ప్రసాదించినవారవతారు.ఒక మనిషి చనిపోతూ కూడా చేసే అత్యంత దానం అవయవ దానం.మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు అని అన్నారు.మరణానంతరం అత్యంత విలువైన అవయవాలను మట్టి పాలు చే యడం కన్నా అవయవ లోపాలతో బాధపడుతున్న వారికి అందజేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించడంలోనే అసలైన ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిపారు.శరీర దానానికి సమాజసేవకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు.డబ్బు సంపాదించడం కన్నా పేరు సంపాదించడం కొరకే తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు.ప్రజా సేవకురాలిగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంఘాల బాద్యులు,ప్రజలు,నాయకులు,మేధావులు అభినందించడం కొసమెరుపు.”సదాశయ ఫౌండేషన్”లింగమూర్తి మనస్స్ఫూర్తి స్వ చ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కండే సాగర్,మచ్చల శ్రీనివాస్,రమాదేవి,సింగిరెడ్డి మల్లారెడ్డి మంజుల,కవిత,లక్మి,నీరజ,అజయ్,తాజ్,మధు,సునీల్,సాగర్,సుజిత్,రేవంత్,శ్రవణ్,తదితరులు పాల్గొ న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here