హైదరాబాద్:దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండిపోతున్నాడు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉత్తర,వాయవ్య,మధ్య భారతంలో అయితే రికార్ఢు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ మేరకు 122 ఏండ్ల రికార్డు బద్ధలైంది.వాయువ్య,మధ్య భారత దేశంలో 122 ఏండ్లలో తొలిసారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచిందని వాతా వరణ విభాగం వెల్లడించింది.సగటు ఉష్ణోగ్రతలే వాయవ్య భారతంలో 35.90 డిగ్రీలుగా,మధ్య భారతంలో 37.78గా నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.ఇక ఈ నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది.దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, మే నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రివేళల్లో సైతం వేడిగా ఉంటుందని తెలిపింది.భారత్‌లో ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదవ్వగా 122 సంవత్సరాల్లో నాల్గవ అత్యధికమని చెప్పారు.మే 2022లో సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా న మోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.