లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్..151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం

లార్డ్స్:లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు భారత్ షాకిచ్చింది.కోహ్లీ సేన సంచలనం సృష్టించింది.తొలి ఇన్నింగ్స్‌లో వెనకబ డిన భారత్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.రెండో టెస్టులో ఆఖరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండే ఫేవరేట్‌గా ఉంది.అయితే చివరి రోజు భారత బౌలర్లు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు.తిరిగి బౌలింగ్‌లోనూ బెంబేలెత్తించారు.ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ‌లిచ్చారు.డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు.దీంతో రెండో టెస్టులో భారత్‌ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన భారత టెయిలెండర్లు మొహమ్మద్ షమీ(56 నాటౌట్),జస్‌ప్రీత్ బుమ్రా(34 నాటౌట్) తొమ్మిదో వికెట్ కి 89 పరుగుల భాగస్వామ్యం అందించారు.ఆ త ర్వాత ఇండియా 298-8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది.దీంతో మ్యాచ్ ని గెలవాలంటే 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు చుక్కలు చూ పించారు భారత పేసర్లు.డ్రా కోసమే ఆడాల్సిన స్థితిలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు.స్కోర్ బోర్డుపై రెండు పరుగులు కూడా చే రకుండానే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.తొలి ఓవర్ మూడో బంతికి బుమ్రా బర్న్స్ ను వెనక్కి పంపగా రెండో ఓవర్‌లో షమి సిబ్లీని పెవిలియన్‌కు చేర్చారు.వీ రిద్దరు కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు.వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు.హమీద్‌ (9),బెయిర్‌ స్టో (2)ల పనిపట్టాడు.కెప్టెన్‌ రూట్‌ (60 బంతుల్లో 33;5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వ లేదు.కానీ బట్లర్‌(96 బంతుల్లో 25;3 ఫోర్లు) మెయిన్ అలీ(13) తో కలిసి పోరాడాడు.ఇద్దరూ ఎంతో సహనంగా బ్యాటింగ్ చేస్తూ ఓవర్లు కరిగిస్తూపోయారు.దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు చెలరేగాయి.ఈ దశలో సి రాజ్‌ వరుస బంతుల్లో మెయిన్ అలీ,సామ్ కరన్‌లను ఔట్ చేశాడు.తరువాత రిబిన్స న్‌(35 బంతుల్లో 9)సహకారంతో బట్లర్ డ్రా కోసం గట్టిగానే ప్రయత్నించాడు.ఈ దశలో బుమ్రా రాబిన్సన్‌ను ఓ స్లో బాల్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.అనంతరం మరోసారి సిరాజ్ అద్భుతం చేశాడు.బట్లర్‌,అండర్సన్‌ను ఔట్ చేసి భారత్ ‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here