మహబూబాబాద్:నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన కేసీఆర్ హంతకుడు మోసగాడని కేసీఆర్ ది మాయ మోసాల ప్రభుత్వం,హంతకులు ప్రభు త్వమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.తెలంగాణాలోని నిరుద్యోగుల కోసం గూడూరు మండలం గుండెంగ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష విరమించారు వైయస్ ష ర్మిల.దీక్ష విరమించిన అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ ఉద్యమంలో పోరాటంలో ముందుండి పోరాటం చేసింది యువకులు విద్యార్థులు అని తెలంగాణను సాధించింది యువకులు,విద్యార్ధులు అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర పరిపాలనను పనికిరాని వారి చేతుల్లో పెట్టామని యువత బాధపడుతుందని నోటిఫికేషన్ల కోసం యేళ్ల తరబడి వందల మంది నిరుద్యోగులు ఎదురు చూశారని ఆవేదన అగాదం చేశారు.రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు చలనం లేదని ఒక్కసారి ఆలోచన చేయమని కేసీఆర్ ని అడుగుతున్నా ఇవి హత్యలా ?లేక ఆత్మహత్యలా ?అని ప్రశ్నించారు.విద్యార్ధులు,యువత పట్ల కేసీఆర్ దొంగ ప్రేమ నటిస్తున్నాడని సునిల్ కుటుంబానికి ఉద్యోగం డబల్ బెడ్ రూం ఇస్తానన్నారు ఏమైంది..?అని నిలదీశారు.కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారని వారి కు టుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.సునిల్ కుటుంబానికి నిరుద్యోగుడైన సునిల్ అన్నకి ఎప్పుడు ఉద్యోగం ఇస్తారని ప్రశ్నించారు.ఎంత మంది నిరు ద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.ఉద్యోగావకాశాలు కల్పించలేని కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న ఒకటే లే కున్నా ఒకటేనన్నారు.కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని తెలిపారు.డిగ్రీలు,పీజీలు చేసిన వారు హమాలి పని చేసుకోవాలని ఓ మంత్రి అంటాడు అయితే కేసీఆర్ మంత్రి వర్గంలో 5 తరగతి చదివిన వారు మాత్రం మంత్రులు అయ్యారని అన్నారు.ప్రతిపక్ష పార్టీలు అన్ని కేసీఆర్ కు అమ్ముడుపోయాయన్న షర్మిల నేను ఎవరికీ బయపడను నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు.నిరుద్యోగులు ఎవరు చనిపోవద్దని చంపవలసింది కేసీఆర్ అహంకారాన్ని అని అన్నారు.ఖాళీ గా ఉన్న లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు
