హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో కలకలం రేపింది.హైదరాబాద్ నగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చుట్టూ పక్కల ఉన్న అన్ని రాష్ట్రల ప్రజలు వచ్చి చికిత్స చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రి.నిత్యం వందల మంది రోగులు వచ్చి వెళ్తూ ఉండే ప్రదేశం.రాజధాని నడిబొడ్డున ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఒక అమానుష ఘటన జరిగింది.రోడ్లు,మందిరాలు థియేటర్లలోనే కాదు ఆకరికి ఆసుపత్రుల్లో కూడా మహిళలపై కామంధులు రెచ్చిపోతు న్నారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రిలో చేరాడు.మూత్రపిండాలు పాడైన బావను అక్కకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన అక్క-చెల్లెల్లపై ఐదుగురు కామాంధులు సాముహిక అత్యాచారం జరగటం అది ఆలస్యంగా వెలుగులోకి రావటం నగరంలో కలకలం రేపుతుంది.రేడియాలజీ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్ తమకు కల్లులో మత్తుమందు కలిపి తాగించి మలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాళ్లు లీస్ స్టేషన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
