హైదరాబాద్:ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు,మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ దళితుడికి సీఎం పదవి ఏమైంది? అని కేసీఆర్‌ని ప్రశ్నించారు.కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.దళితులకి మూడు ఎకరాల భూ మి ఏమైందని నిలదీశారు.హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారన్నారు.ఏడేళ్లుగా లేనిది ఇప్పుడే దళితులు గుర్తొచ్చారా..? అని ప్రశ్నిం చారు.రైతులకు బేడీలు వేసిన చరిత్ర మరిచిపోయారా..? అని ప్రశ్నించారు.మరియమ్మను పోలీస్ కస్టడీలోనే చంపేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.దళితజాతికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.హుజూరాబాద్ దళిత బంధు సభలో కేసీఆర్ ఒక్క నిజం చెప్పలేదన్నారు.చెప్పిన అబ ద్ధం చెప్పకుండా కేసీఆర్ మళ్లీ అబద్ధాలే చెప్పారన్నారు.బీటలు వారిన కోటను కాపాడుకునేందుకు కేసీఆర్ ఆత్రం,ఆవేదన పడుతున్నారని చెప్పారు.కాసుల కోసం,క మీషన్లు కొల్లగొట్టేందుకు 3 ప్రాజెక్టులు తీసుకొచ్చారని మండిపడ్డారు.మిషన్ భగీరథ పేరుతో 50వేల కోట్ల అప్పు ప్రజల మీద రుద్దారన్నారు.కాళేశ్వరం రీడిజైన్,మిష న్ భగరీథ,మిషన్ కాకతీయ అందులో భాగమేనని చెప్పారు.దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తే కేసీఆర్‌కి చిల్లిగవ్వ కమీషన్ రాదని రేవంత్‌రెడ్డి అన్నారు.