హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్.పంట రుణాల మాఫీ ప్రక్రియను ఇవాళ్టి నుంచి మొదలు పెట్టింది.ఎన్నికల హామీ నేపథ్యంలో విడత ల వారీగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్ ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది.ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రు ణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్.ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. మలి విడతలో రాష్ట్రంలోని ఆరు లక్షలమంది అన్నదాతలకు రుణమాఫీ ప్రకటించింది.రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ మంత్రి మండలి నిర్ణయించింది.ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు దీనిని పూర్తి చే యాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 నుంచి మూడు లక్షలమంది రైతులకు రూ.25 వేల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.తాజాగా రూ.50 వేల లోపు రుణాలను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.దీని ద్వారా మొత్తం తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ వర్తించింది.మిగిలిన వారికి దశలవారీగా వర్తింపజేస్తామని తెలిపారు.గిరాకీ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని,రైతాంగాన్ని సమాయత్తం చేయాలని వ్యవసాయాధి కారులకు కేబినెట్ సూచించింది.ఆదివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2 వేల5 కోట్ల 85 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభత్వం.50 వేల వరకు రుణాలు న్న 6 లక్షల 6 వేల 811 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. 25 వేల 100 వరకు రుణం ఉన్న రైతు ల రుణమాఫీపై ట్రయల్ రన్ పూర్తయింది.ఈనెల 30 వరకు 25 వేల నుంచి 50 వేల వరకు రుణాలున్న రైతులకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం.రైతుబం ధులా గుంట భూమి నుంచి ఎకరా వరకు,ఎకరా నుంచి 2 ఎకరాలు,2 నుంచి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లుగానే 25,26,27 వేల చొప్పున రుణాలు మాఫీ అవుతాయి.ఈ మేరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.రైతుబంధు తరహాలోనే వందశాతం విజయవంతంగా పంట రు ణాలు మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.ఆన్‌లైన్ ద్వారా అమలు చేసేందుకు ఇప్పటికే ట్రయల్ రన్ ను ప్రభుత్వం నిర్వహించింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...