చత్తీస్‌గఢ్‌లో..మందుపాతర పేల్చిన మావోలు

రాయ్ పూర్:చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మరోమారు చెలరేగిపోయారు.పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు.నారాయణ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.కడెనార్-మందోడా మధ్య ఈ ఘటన జరిగినట్టు నారాయణ్‌పూర్ ఎస్పీ తెలిపారు.జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పా రు.గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.ఘటన సమయంలో బస్సులు 27 మంది జవాన్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here