తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి..నామినేషన్ల స్వీకరణ

అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోరు మొదలైంది.ఎపిలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఇటీవల నోటిఫికేషన్‌ వెలవడిన సంగతి తెలిసిందే.నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.మార్చి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు.31న నామినేషన్ల పరిశీలన,ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్‌ 17న ఉప ఎన్నికలు,మే 2న కౌంటింగ్‌,ఫలితాలు ఉంటాయి.ఎపిలో ఇటీవల గ్రామ పంచాయతీ,మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో అధికార పార్టీ వైసిపి అఖండ విజయం సాధించి రెట్టింపు ఉత్సాహంతో మున్సిపల్‌,కార్పొరేషన్ల బరిలోకి దిగింది.వాటిలోనూ ఒక్కస్థానం మినహా మిగిలిన అన్ని మున్సిపల్‌,కార్పొరేషన్‌ స్థానాలను కైవసం చేసుకుంది.ఇదే ఉత్సాహంతో తిరుపతి ఉప ఎన్నిక బరిలో దిగుతోంది.ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ,మున్సిపల్‌ ఎన్ని కల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ప్రతిపక్ష టిడిపి ఎలాగైనా తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది.ఈ క్రమంలోనే బిజెపి మినహా ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించారు.వైసిపి అభ్యర్థిగా గురుమూర్తి,టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ పడుతున్నారు.బిజెపి-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here