కరీంనగర్:ఆకుకూరల్లో ఒకటైన గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు.ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్లు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు.ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ లో సైతం గోంగూరను ఉపయోగిస్తుంటారు.పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ గ్రేట్‌గా సహాయపడుతుంది.మరి గోంగూర తినడం వ ల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? తెలుసుకుందాం.గోంగూరలో పొటాషియం,ఇనుము,ఫైబర్,క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభ్యమవుతాయి.ఇవి గుం డె జబ్బులు రాకుండా రక్షిస్తాయి.రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయడంతో పాటు రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తాయి.అలాగే గోంగూరలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి.మధుమేహం సమస్యతో బాధపడేవారు గోంగూర తింటే చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి,షుగర్ లెవెల్స్ని తగ్గిం చడంలో గోంగూర అద్భుతంగా సహాయపడుతుంది.ఇక విటమిన్స్ ఎ,బి,సితో పాటు మినరల్స్ పుష్కలంగా ఉండే గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగు తుంది.ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తి పెరగడం చాలా ముఖ్యం.కాబట్టి,మీ డైట్‌లో గోంగూరను తప్పకుండా చేర్చుకుంటే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అదేవిధంగా,గోంగూర పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఖచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఇందులో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ కూడా లభిస్తుంది.ఇక రక్తహీనత సమస్యను దూరం చేసే ఐరన్ కూడా గోంగూరలో ఉంటుంది.వారానికి ఒకసారి అయినా గోంగూరను తీసుకోవాలి.