వరంగల్..టీఆర్ఎస్ విజయ గర్జన సభ జరిగేనా?

హన్మకొండ:హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమి నుంచి ఇంకా కోలుకోకముందే సీఎం కేసీఆర్‌ కు మరో తలనొప్పి మొదలయింది.నవంబరు 29న టీఆర్ఎస్ తలపెట్టిన విజయగర్జన సభ కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.హనుమకొండ జిల్లా దేవన్నపేటలో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు.పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ సభకు ఇ చ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.శుక్రవారం సభాస్థలి నిర్వహణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.మీ రాజకీయాల కోసం మా పంటలను నాశనం చేసుకోవాలా? అంటూ మండిపడ్డారు.ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి మళ్లీ రావొద్దని ధర్నాకు దిగారు.రైతుల ఆందోళనలతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు.హన్మకొండ జిల్లాలో వి జయ గర్జన సభ ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్ నేతలు రెండు మూడు రోజులుగా కసరత్తులు చేస్తున్నారు.ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌,మాజీ మంత్రి కడియం శ్రీహరితో పాటు పలువురు నేతలు హన్మకొండ జిల్లా పరిధిలోని మామునూర్‌,రాంపూర్‌,దేవన్నపేటలోని ఖాళీ భూములను పరిశీలించారు.ఈ క్రమంలోనే దేవన్నపేటు వెళ్లగా టీఆర్ఎస్ నేతలతో రైతు లు వాగ్వాదానికి దిగారు.తాము భూములు ఇవ్వబోమని పంటలు పండే భూములను సభ కోసం ఎలా ఇస్తామిన ప్రశ్నించారు.సభకు భూమి ఇవ్వకపోతే ధరణి పోర్టల్ నుంచి భూము లు వివరాలు లేకుండా చేస్తామని,మీ భూమిని వేరొకరి పేరుమీద చేస్తామని కొందరు టీఆర్ఎస్ నేతలు,అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాల ని వారు వాపోయారు.కాగా,టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో 10 లక్షల మందితో విజయగర్జన సభ జరపాలని ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో నిర్ణ యించిన విషయం తెలిసిందే.నవంబరు 15న సభ నిర్వహించాలని మొదట అనుకున్నారు.విజయ గర్జన సభకు జనం తరలింపుపై 103 నియోజకవర్గాల నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌ వరుసగా 6 రోజులు సమావేశాలు జరిపారు.10 లక్షల మందితో సభ అంటే 400 ఎకరాల ఖాళీ స్థలం కావాలని అంచనా.సభా స్థలం సేకరణతో పాటు జనసమీకరణ,ఇ తర ఏర్పాట్లల గురించి నేతలతో కేటీఆర్ చర్చించారు.అనంతరం 22 వేల బస్సుల్లో నేతలను,జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.కానీ అంతలోనే సభ తేదీని మార్చారు సీఎం కే సీఆర్.తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబరు 19న విజయ గర్జన సభను నిర్వహిస్తతే బాగుంటుందని ఉమ్మడి వరంగల్ మంత్రులు,నేతలు సీఎం కేసీఆర్‌కు సూచించారు.వారి విజ్ఞప్తి మేరకు సభను నవంబరు 29కి వాయిదా వేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి.ఆ ఉద్యమం చివరి దశకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ దీక్షకు దిగారు.’తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో”అనే నినాదంతో నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింతగా ఊపందుకుంది.ఇక తెలంగాణ ఏర్పాటు తరువాత నవంబర్ 29ని తెలంగాణ దీక్షా దివస్‌గా ప్రకటించారు సీఎం కేసీఆర్.ప్రతి ఏటా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా దీక్షా దివస్‌ను జరుపుకుం టున్నారు.ఈసారి ఆ రోజునే తెలంగాణ విజయ గర్జన సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలలు అభిప్రాయపడ్డారు.వారి విజ్ఞప్తి మేరకు నవంబరు 29ని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లలో మునిగిపోయాయి.కానీ సభకు భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here