వానాకాలం పంట కొంటాం..కానీ యాసంగి పంట కొనలేము:మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్:ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.శనివారం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోల్లపై వివరించారు.యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితుల్లో రైతులు యాసంగి సీజన్ లో వరి వేయొద్దన్నారు.యాసంగి వరికీ బదులు ప్రత్యా మ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించామని సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న వాళ్ళు వరి పంట వేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రం గంలో నిర్దిష్టమైన ప్రగతి సాధించిందన్న ఆయన తెలంగాణ వచ్చే నాటికి 22 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఇవాళ అవి ముప్పై లక్షలకు చేరాయన్నారు.వానాకాలంలో అన్ని ర కాల పంటలు ఒక కోటి యాబై లక్షలకు పైగా ఉంటే వరి 62లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు.వానాకాలం సమయంలో పండే వరి పంట కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎ లాంటి ఇబ్బందులు లేవని ఎఫ్ సిఐ బాయిల్డ్ రైస్ కొనమని స్పష్టం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని తెలిపిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here