నా జన్మ ధన్యమైంది..నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం:ఈటల


హుజురాబాద్:నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమని వారికి నా చర్మం ఒలిచి,వాళ్ళకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను.కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువు కి కూడా రావొద్దు కుట్రదారుడు కుట్రలలోనే నాశనం ఐపోతాడు 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?నేను పార్టీలు మారేవాడిని కా దు.నా చరిత్ర తెరిచిన పుస్తకం.కేసీఆర్ అహంకారాన్ని,బెదిరింపులను లెక్కచేయకుండా హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లు మనిపించారని ఈటల రాజేందర్ అన్నారు.ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదు హుజురాబాద్ ప్రజలు గుండెను చీల్చి,తమ ఆత్మను ఆవిష్కరించి నన్ను గెలిపించారు.నా చర్మం ఒలిచి,వాళ్ళకి చెప్పులు కు ట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను కులాల పరంగా చీలిక తెచ్చినా అనేక ప్రలోభాలకు గురిచేసినా హుజురాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని,భారీ విజయాన్ని అందించా రు.నన్ను టీఆరెస్ నుంచి వెల్లగొట్టిన తర్వాత నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అమిత్ షా నాకు సంపూర్ణ సహకారం అందించారు జేపీ నడ్డా కూడా ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో తగు సూచనలు చేశారు.నా గెలుపుకోసం వందలాదిమంది కనపడకుండా కూడా పనిచేశారు.హుజురాబాద్ లో ఈటల గెలవడం అంటే అంద రూ గెలిచినట్టేనని వివిధ వర్గాల వారు,ఉద్యోగులు భావించారు.ఎప్పుడూ బయటికి రాని దత్తాత్రేయ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు O.U,K.U తో పాటు ఎందరో విద్యా ర్థులు నాకు సహకరించారు.సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కుయుక్తులను చీల్చి చెండాడారు.ప్రపంచంలోని తెలుగు వారంతా కూడా నా గెలుపును కోరుకున్నారు.నిజంగా దీపావళి ఈనెల 4న అయితే నా గెలుపు తో ప్రజలంతా నిన్ననే దీపావళి చేసుకున్నారు.గతంలో నాకు వచ్చిన ఓట్లకంటే ఈసారి ఎక్కువే ఓట్లు సాధించాను.గతంలో తన గుర్తుతో గెలిచానన్న కేసీఆర్ కు ఇప్పుడు నా గుర్తుతో(బీజేపీ) గెలిచి కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.ఈ గెలుపు కేసీఆర్ అహంకారం మీద ప్రజలు గెలిచిన గెలుపే దళితబంధు కింద రూ.10 లక్షలు. పదిసార్లు ఇచ్చినా నిన్ను మర్చిపోమని మా దళిత ప్రజలు నాకు అండగా ఉంటామని నిలబడ్డారు.కేసీఆర్ తన అకృత్యాలతో నాకు ఒక్క ఓటు కూడా పడొద్దని ప్రయత్నించి,పూర్తిగా విఫలమ య్యారు.పోలీసులే ఎస్కార్ ఇచ్చి డబ్బుల పంపిణీ చేయించారు.నాలాంటి కష్టం శత్రువు కి కూడా రావొద్దు కళ్ళముందు లక్షలు కనిపించినా అవన్నీ తిరస్కరించి అన్ని కుల సంఘాల వారు నన్ను గెలిపించేందుకు సహకరించారు.తెల్ల బట్టలో పసుపు బియ్యం పట్టుకుని ఓట్లు టీఆరెస్ కే వేయాలని,నన్ను ఓడగొట్టాలని ప్రజలను బెదిరించారు.హుజురాబాద్ ప్రజలను అన్ని రకాలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు కుట్రదారుడు కుట్రలలోనే నాశనం ఐపోతాడని,2 గుంటల మనిషి వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు? టీఆరెస్ పార్టీ వె ల్లగొడితే బీజేపీ పార్టీనే నన్ను అక్కున చేర్చుకుంది.నా అంతట నేను టీఆరెస్ నుంచి బయటికి రాలేదు.నేను ఎప్పుడూ కమిట్మెంట్ తోనే ఉన్నాను నా చరిత్ర తెరిచిన తెల్లకాగిత మని సూర్యుడు మీద ఉమ్మేస్తే ఏమవుతుందో కేసీఆర్ కు అర్థమైంది ఎప్పుడూ తప్పుచేయని బిడ్డ ఈటల ఎప్పుడూ నోట్లో నాలుక లాగానే ఉంటాను.రాబోయే కాలంలోనూ ప్రజల గొం తుక గానే ఉంటా తెలంగాణ బిల్లు పాస్ ఐనప్పుడే ఒకసారి నా జన్మ ధన్యమైంది.ఈ మొత్తం విజయాన్ని హుజురాబాద్ ప్రజలకే అంకితం ఇస్తున్నా చచ్చేవరకు మీతోనే ఉంటా.నన్ను ఓడిం చడానికి ఇక్కడికి వచ్చిన వారి భరతం పట్టుడు ఖాయం.పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని ఈటెల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here