హైదరాబాద్‌లో..భారీ వర్షం

0
396

హైదరాబాద్:హైదరాబాద్‌లో కుండపోత వర్షం మొదలైంది.నగరంలోని సికింద్రాబాద్,ఆర్టీసీ క్రాస్రోడ్,రాంనగర్,ముషీరాబాద్,విద్యానగర్,అంబర్‌పేట్,తార్నాక,అత్తాపూర్, కార్వాన్,బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమైనట్లు తెలుస్తోంది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకా రం తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్,మం చిర్యాల,పెద్దపల్లి,జయశంకర్భూపాలపల్లి,ఖమ్మం,మహబూబాబాద్,వరంగల్,సిద్దపేట,భువనగిరి,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,వికారాబాద్,జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.శుక్రవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది.రానున్న 6 గంటల్లో ఇది మరిం త బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది.ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం,గోపాల్ పూర్,కళింగ పట్నం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.27న ఈశాన్య,పరిసర మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ,రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రానున్న 3 రోజులు తెలంగాణ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.అ ల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు,రేపు భారీ వర్షాలు పడనున్నాయి.తూర్పు మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్ప పీడనంగా మారింది.ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ,కళింగపట్నానికి 740 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఈ తుఫానుకు గులాబ్‌గా నామకరణం చేశారు.తుఫాన్‌ ప్రభావంతో శని,ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు,గరిష్టంగా 80 కి.మీ,సోమవారం 70 నుంచి 80 కి.మీ,గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here