హైదరాబాద్:ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరెవరి మీద వచ్చుండవేమో.పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది.తమది కేవలం స్నేహం మాత్రమేనని ఇద్దరూ చెప్పినప్పటికీ ఆ పుకార్లకు తెర పడలేదు.ఆ తర్వా త కూడా ఆమె వేరే వ్యక్తులను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం జరిగింది.పెళ్లికి అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆ మె జాతకాన్ని కొందరు అభిమానులు జ్యోతిష్యులకు చూపించారు.ఆమె జాతకాన్ని చూసిన ప్రముఖ పండిట్ జగన్నాథ్ గురూజీ కీలక విషయాలను తెలిపారు.ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలు నిజం కాదని,అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆయన చెప్పారు.వృత్తి విషయంలో అనుష్క ఎంతో సిన్సియర్ గా ఉంటుందని అన్నారు.ఆమె ముఖాన్ని బట్టి చూస్తే,ఒకే వృత్తిలో ఉన్న వారితో కలవడానికి ఆమె ఇష్టపడదని చెప్పారు.ఆమెలో అహంకారం కూడా ఉండదని తెలిపారు.ఆమె కెరీర్ ఇంకా గొప్పగా ఉంటుందని తెలిపారు.సినీ పరిశ్రమలో ఉన్నంత కాలం ఆమె స్టార్ గానే ఉంటుందని చెప్పారు.ఇండస్ట్రీ బయటి వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నా రు.వచ్చే ఏడాది ఆమె పెళ్లి అవుతుందని లేనిపక్షంలో 2023లోపు పెళ్లితంతు పూర్తవుతుందని చెప్పారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...