వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కనిపించని హన్మకొండ జిల్లా

హైదరాబాద్:తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.ఒక ప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు,నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 306 పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి.దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,59,313 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడిం చింది.దీంతోపాటు ఈ వైరస్‌ కారణంగా 3,883 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. *తాజాగా జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు..*
ఆదిలాబాద్‌-2,భద్రాది కొత్తగూడెం-8,జీహెచ్‌ఎంసీ-78,జగిత్యాల-12,జనగామ-4,జయశంకర్‌ భూపాలపల్లి-1,జోగులాంబ గద్వాల-1,కామారెడ్డి-3,కరీంనగర్‌-31, ఖమ్మం-14,కొమురంభీం ఆసిఫాబాద్‌-2,మహబూబ్‌నగర్‌-4,మహబూబాబాద్‌-4,మంచిర్యాల-7,మెదక్‌-2,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-16,ములుగు-3,నాగర్‌ కర్నూల్ -0,నల్గొండ-14,నారాయణపేట-3,నిర్మల్‌-2,నిజామాబాద్‌-4,పెద్దపల్లి-10,రాజన్న సిరిసిల్ల-7,రంగారెడ్డి-12,సంగారెడ్డి-3,సిద్దిపేట-6,సూర్యాపేట-8,వికారాబాద్‌- 4,వనపర్తి-3,వరంగల్‌ రూరల్‌-6,వరంగల్‌ అర్బన్‌-23,యాదాద్రి భువనగిరి-6 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here