న్యూఢిల్లీ:తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్ప ష్టం చేసింది.పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది.అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకా శం ఉందని పేర్కొంది.అలాగే ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. *బంగాల్,ఒడిశాలో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం*ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్,జంగీపూర్,శంషేర్‌గంజ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ట్లు సీఈసీ వెల్లడించింది.అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నట్లు తెలిపింది.