ఎన్నాళ్లు ఆగాలని..తాళాలు పగులగొట్టి..

జగిత్యాల:జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ నెలకుంది.డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.అంతటితో సరి పెట్టలేదు.ఏకంగా తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు.ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే మల్యాల మండలం నూకపల్లిలోని 19 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ల్లో లబ్దిదారులు గృహప్రవేశం చేశారు.పోయిన దసరాకే ఇళ్లిస్తామని చెప్పి నెలల తరబడి జాప్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.తాము గుడిసెల్లో బ్రతుకుతు న్నామని విషపురుగులతో జీవించలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఇక గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెబు తున్నారు.మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగులగొట్టి శుక్రవారం లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు.ఏడాది కిందటే కాంట్రాక్టర్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా జిల్లా అధికారులు పరిశీలించి గత సంవత్సరం దసరా పండుగకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని అధికారు లు ప్రకటించారు.తీరా అది జరగకపోవడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు శుక్రవారం తాళాలు పగలగొట్టారు.అయితే నూకపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం 65 మంది ఇండ్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసింది.2020 దసరా పండుగకు లబ్ధిదారులకు అప్పజెప్పడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు,అధి కారులు హామీ ఇచ్చారు.ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ అధికారులు ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇండ్లు లబ్ధిదా రులకు ఇవ్వకపోవడంతో గుడిసెల్లో ఉంటూ పాములు,తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.ఎమ్మెల్యే,అధికారులు మాట నిలుపుకోలేదనే కో పంతో శుక్రవారం 19 ఇండ్ల తాళాలు పగులగొట్టి గృహప్రవేశం చేశారు.ఇండ్ల ముందు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి,ఇండ్లను శుభ్రం చేసుకొని అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు,ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి అడుగగా గత ఏడాదే చొప్పదండి ఎమ్మెల్యే మాకు గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారని తెలిపా రు.ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో మేమే గృహప్రవేశాలు చేసుకున్నామని అన్నారు.అయితే సంబంధిత అధికారులు అధికారికంగా త్వరలోనే పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు చేయిస్తారని వారు చెప్పారు.ఈ క్రమంలో లబ్ధిదారులు మేము ఇండ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని,అధికారులు తమను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే ఆత్మ హత్యలు చేసుకుంటామని తేల్చిచెప్పారు.దీంతో నూకపల్లి కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తగా మల్యాల పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.మరి ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Telangana: Piqued by delay, 19 families break into 2BHKs at Nookapalli- The  New Indian Express

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here