ఫ్రెంచ్‌ ఓపెన్‌:క్రెజికోవాకు టైటిల్‌

గారోస్:‌ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా కైవసం చేసుకున్నది.శనివారం సాయంత్రం రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 31వ సీడ్ అనస్తాషియా పవ్లీచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది.25 ఏళ్ల క్రెజికోవా కెరీ ర్‌లో ఇది 5వ మేజర్ టైటిల్ మాత్రమే.ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా ఆరో సారి కొత్త ప్లేయర్ గెలవడం విశేషం కాగా ఇందులో క్రెజికోవా మూడో అన్‌సీడెడ్ ప్లేయర్.31వ సీడ్ పవ్లీచెంకోవాకు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్.అయితే తొలి సెట్ కోల్పోయిన తర్వాత రెండో సెట్ గెలిచి ఆటలో పుంజుకున్నది.క్రె జికోవా పలు అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్,డబుల్ ఫాల్ట్స్ చేసినా తన పవర్ గేమ్‌తో మూడో సెట్ గెలిచి సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది.చెక్ రిపబ్లిక్‌కి చెందిన హన మం డ్లికోవా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది.ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా కొత్త ఛాంపియన్లు అవతరిస్తున్నారు.గార్బిన్ ము గురూజా,జెలేనా ఆస్తపెంకో,సిమోనా హెలెప్,ఆష్లీ బార్టీ,ఇగ ష్వామ్‌టెక్ తర్వాత బార్బారా క్రెజికోవా టైటిల్ నెగ్గింది.ఇక క్రెజికోవా రోలాండ్ గారోస్‌లో 2013 గర్ల్స్ డబు ల్స్,2018లో ఉమెన్స్ డబుల్స్,2021లో ఉమెన్స్ సింగిల్స్ గెలిచింది.ఆదివారం తన పార్ట్‌నర్ కేథరియా సినియాకోవా కలసి డబుల్స్ ఫైనల్స్ ఆడనున్నారు.ఈ టైటి ల్ గెలిస్తే ఒకే ఏడాది సింగిల్స్,డబుల్స్ గెలిచిన మేరీ పియర్స్ (2000లో) రికార్డును సమం చేసే అవకాశం ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here