దళితులకు లేని భూమి..అమ్మకానికెక్కడిది?:ఎన్వీఎస్ఎస్

హైదరాబాద్‌:తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.భూ ముల విక్రయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.దళితులకు ఇవ్వడానికి లేని భూమి అమ్మకానికి ఎక్కడిది అని ప్రశ్నించారు.తెలంగాణ సీడ్ బౌల్ అని కేసీఆర్ పదే పదే చెప్పారని కానీ రాష్ట్రంలో కల్తీ విత్తనాల అమ్మకాలు పతాకస్థాయికి చేరాయని ప్రభాకర్ ఆరోపించారు.ఏడేళ్లలో నకిలీ విత్తనాల దళారులను పట్టు కొని శిక్షించిన దాఖలాలు లేవు అని చెప్పారు.600 కేసులు నమోదైతే 25 మందిపై కూడా పీడీ యాక్టు పెట్టలేదని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here