హుజురాబాద్:ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన క్షణం నుండి జిల్లాలో రాజకీయ పావులు చకచకా కదులుతున్న విషయం అందరికి విదిత మే.కాగా తెరాస పార్టీ నుండి బయటకు వచ్చిన ఈటల తన వర్గాన్ని బలపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో హుజురాబాద్ తెరాస పార్టీ నాయకులు ఈటల వర్గానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.కాగా ఈరోజు తెరాస పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తోంది.తాజాగా మంత్రి గంగులను కల్సి మ ద్దతు తెలిపిన వీణవంక ఎంపిపి ముసిపట్ల రేణుక.గంగులకు మద్దతు తెలిపి రెండు రోజులు కూడా అవ్వక కుండానే ఈ రోజు ఈటలను కలిశారు.ఇప్పుడు ఈ అంశం స్థానికంగా సంచలనం సృష్టించింది.