ఆసిఫాబాద్:ఆధునిక కాలంలో పాలిష్ చేసిన బియ్యం పురుగు మందులు కొట్టిన కూరగాయలు,పండ్లు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం బిజీ లైఫ్‌లో తినే తిండి గురించి కూడా మరిచిపోతున్నాం.తద్వారా పలు అనారోగ్య సమస్యలు తెచ్చుకొని బాధపడుతున్నాం.అందుకే మన పెద్దలు చిరు ధాన్యాలు తినమని సలహా ఇస్తున్నారు.వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ఇందులో ముఖ్యంగా కొర్రలు చాలా ముఖ్యమైనవి.ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచి వి.చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కొర్రల్లో మాంసకృతులు,కాల్షియం,ఐరన్,మాంగనీస్,మెగ్నీషియం,ధైమిన్,రైబోఫ్లేవిన్ తో పా టు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది.వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు.కొర్రలు తీపి,వగరు రుచిని కలిగి ఉంటాయి.వీటి లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.చిన్నపిల్లలకు,గర్భిణిలకు మంచి ఆహారం.ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభి స్తుంది.కడపునొప్పి,మూత్రంలో మంట,ఆకలి లేకపోవడం,అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టొచ్చు.వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గిం చుకోవచ్చు.అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని మందగించడానికి విటమిన్ బీ 1 కొర్రల్లో అధికంగా ఉంటుంది.అలాగే,ఏకాగ్రత,జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది.మానసిక దృక్పథానికి మద్దతు ఇస్తుంది.బెల్స్ పాల్సీ,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమ స్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతుంది.నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ సహాయపడుతుంది.కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు,మతిమరుపు కనిపించవు.కొర్రల్లో మాంస కృత్తులు ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది.వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతాయి.రక్తాన్ని వృద్దిచేస్తుంది.శరీరా నికి అమితమైన పుష్టినిస్తాయి నడుముకు మంచి శక్తిని ఇస్తాయి.