మన పొట్టలో ఎన్ని వైరస్‌లు ఉంటాయో.. అవేం చేస్తాయో తెలుసా?

కరీంనగర్:బయటి గాల్లోనే కాదండోయ్ మన శరీరంలో కూడా కనిపించని ఎన్నో వైరస్ జాతులు జీవిస్తుంటాయి.బ్యాక్టీరియా,వైరస్ లు,ఫంగస్ వంటి సూక్ష్మజీవులకు మన ప్రేగులే పుట్టినిల్లు దాదాపు లక్షాల 40వేల వైరల్ జాతులు మన పొట్టలో నివసిస్తున్నాయంట ఇన్ని లక్షల సూక్ష్మజీవులు ఉన్నా మనం ఎందుకు ఆరోగ్యంగానే ఉన్నామంటే ఇదే డౌట్ మన సైంటిస్టులకు వచ్చింది.అదేపనిగా అధ్యయనాలు చేయడం మొదలుపెట్టేశారు.వాస్తవానికి మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవన్నీ ని రంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయట.మనకు తెలియని ఎన్నో వైరల్ జాతులు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.అవి కూడా మన పొట్టలోనే ఉన్నాయని అంటున్నారు.అనేక రకాల లక్షలాది వైరస్ లు మనిషి శరీరంలో జీవిస్తున్నాయని తెలిసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు.మనిషి జీర్ణాశయంలో ఉండే ఈ వైరస్ లన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఎలా జీవిస్తున్నాయి అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ప్రేగుల్లో జీవించే వైరస్‌ల జీవన విధానాన్ని అర్థం చేసుకునేం దుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.వందల వేలాది బ్యాక్టీరియా,వైరస్‌లు,ఫంగీలు,పరాన్నజీవులకు మన శరీరమే ఆతిథ్యమిస్తోందని ఎప్పుడైనా అనుకున్నారా?ఇంతకీ ఈ వైరస్ లు ప్రేగుల్లో ఎందుకు తిష్టవేశాయి.అసలేం చేస్తుంటాయంటే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వైరస్ లే సాయం చేస్తాయంట మనిషి శరీరంలోని మైక్రో ఆర్గానైజమ్స్ అన్ని కలిసి మైక్రోబయోమ్ గా మారిపోతాయి.ఇవి ఎక్కువగా జీర్ణాశయాంతర గోడల్లో నివసిస్తుంటాయి.ఈ మైక్రోబయోటా అనే వైరస్ లు మిలియ న్ల ఏళ్ల నుంచి మనిషి ఆకారం,కణాల అభివృద్ధితో పాటు రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంటాయి.హానికరమైన మైక్రోఆర్గానైజమ్స్,విషపూరిత సమ్మెళనా లను తొలగించడంలో రక్షణగా ఉంటాయి.రోగనిరోధక వ్యవస్థ స్పందించేలా సూచనలు చేస్తుంటాయి.పోషకాహారంతో పాటు తిన్న ఆహారం త్వరగా అరిగిపోయేలా చేస్తా యి.అయితే వీటి డీఎన్ఏ సీక్వెన్స్ మెథడ్ కు సంబంధించి తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 28వేల మైక్రోబయోమ్ శాంపిల్స్ సేక రించారు.ఆ విధంగా మన ప్రేగుల్లో 1,40వేలకు పైగా వైరల్ జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తమ విశ్లేషణలో తేల్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here