తెలంగాణలో..విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్:దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం,రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.గత నెల మార్చి 1న తెలంగాణ లో 1,907గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే 25 వేలకు చేరుకుంది.అంటే కేవలం నెలన్నరలోనే తెలంగాణలో ఆక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 12 రేట్లు పెరిగింది.అలాగే కోవిడ్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల కారణంగా తెలంగాణలో ప్రస్తుతం ప్రభావవంతమైన పునరుత్పత్తి సంఖ్య (Rt) 1.65గా ఉంది.ఇది జా తీయ సగటు 1.33 కంటే ఎక్కువ.ఈ కారణంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,157 మందికి పాజిటివ్ అని తేలింది.అయితే ఇంకా 4,959 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య 3,34,738కి చేరుకుంది.నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 361 మందికి కోవిడ్ సోకి నట్లు నిర్ధారణ కాగా,మేడ్చల్ నుంచి 245 కేసులు,రంగారెడ్డి నుంచి 206,నిజామాబాద్ నుంచి 187,సంగారెడ్డి నుంచి 135,మరియు జగిత్యాల నుంచి 107 కేసు ల చొప్పున నమోదయ్యాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.నిన్న సాయంత్రం వరకు రాష్ట్ర వ్యా ప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం,ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివ రాలు ఇలా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,780కు పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here