జగిత్యాల:ఒక వైపు కరోనా మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు.దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుం ది.ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం పై దృష్టి పెట్టడం పనిలో నిమ్మగ్నమవ్వడం చేస్తుంటారు.అయినా కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా ముఖ్యమే.నియంత్రణ లేని ఆలోచనలను అధిగ మించేందుకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.డిప్రెషన్‌ను అధిగమించేందుకు ఉరుకుల పరుగుల ప్రయాణాలకు దూరంగా చుట్టు పచ్చని చెట్లు పక్షుల శబ్ధాలు విన బడే ప్రదేశాలకు వెళ్లిపోవాలనుకుంటారు.అయితే అలా వెళ్లడం చాలా మందికి కుదరకపోవచ్చు.మీ ఇంటినే పచ్చని చెట్లతో అందంగా ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసుకోవచ్చు.అలాగే కొన్ని రకాల మొక్కలు మీ ఇంట్లో ఉండడం వలన ఒత్తిడిని తగ్గిస్తాయి. *తులసి:తులసి చెట్టుకు మన భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది.తులసి దేవతగా భావించి పూజిస్తుంటారు.అలాగే తులసి వలన ఎన్నో ఆరోగ్య ప్రయో జనాలున్నాయి.తులసి చెట్టును ఇంట్లో పెట్టడం వలన అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. *గులాబీలు:ఇంట్లో గులాబీ మొక్కను నాటడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.గులాబీలు శాంతి,ప్రేమ,సానుకూల వాతావరణానికి ప్రతికూలంగా నిలుస్తాయి.ఈ మొక్క ఒత్తిడిని తగ్గించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. *మనీ ప్లాంట్:ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క.బెడ్ రూమ్,బాల్కనీ,బాత్రూమ్,డ్రాయింగ్ రూమ్ లేదా గార్డెన్‌లో కూడా ఈ మొక్కను సులువుగా పెంచవచ్చు.కొంతమంది ఈ మొక్కలను వంటగదిలో పెంచుతుంటారు.దీని ద్వారా వంట గది ఎంతో అందంగా ఉంటుంది.ఈ మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.ఈ మొక్కలకు ఎక్కువ జాగ్రత్త అవసరం. *జాస్మిన్:మల్లె పూల సువాసన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.మల్లె మొక్కలను పవిత్రంగా భావిస్తారు.ప్రపంచంలోని అనేక దేశాలలో పూజిస్తారు.జాస్మిన్ పువ్వు విశ్వాసం,ప్రేమ,సంబంధాన్ని బలోపేతం చేసే చిహ్నంగా భావిస్తారు.ధూపం,మల్లె పువ్వులు కొవ్వొత్తులకు సువాసనను జోడించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్కలను నాటడం వల్ల రాత్రికి మంచి కలలు వస్తాయని అంటారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...